Sat Dec 13 2025 22:32:54 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : హైడ్రా కూల్చివేతలు ఉదయం నుంచి షురూ
ఈరోజు ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి

ఈరోజు ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి. కొండాపూర్ లోని బిక్షపతి నగర్ లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. శనివారం కావడంతో నేడు హైడ్రా కూల్చివేతలను ప్రారంభించిందని స్థానికులు, అక్కడ ఉంటున్న వారు ఆరోపిస్తున్నారు.
కొండాపూర్ లోని బిక్షపతి నగర్ లో...
కొండాపూర్ లోని బిక్షపతి నగర్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించుకున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో పెద్ద సంఖ్యలో అక్కడకు ప్రజలు చేరుకున్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు మీడియా ప్రతినిధులను కాని, ప్రజలను కానీ కూల్చివేతలను జరిగే ప్రాంతానికి అనుమతించడం లేదు. ఆక్రమణలను మాత్రమే కూల్చివేస్తున్నట్లు హైడ్రా అధికారులు చెప్పారు.
Next Story

