Fri Dec 05 2025 14:12:16 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచే కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించారు

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచే కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించారు. నాలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జేసీబీలతో తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగిస్తున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ లో...
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను అనుసరించి హైడ్రా అధికారులు తొలుత అవి ఆక్రమాణాలా? కాదా? అని నిర్ధారించుకుంటున్నారు. తర్వాత అవి ఆక్రమణలు అని తేలినా, ప్రభుత్వ స్థలాన్ని, నాలాను, చెరువును ఆక్రమించినట్లుగా తేలితే వెంటనే జేసీబీ, బుల్ డోజర్లను పంపించి కూల్చివేస్తున్నారు. పార్కులను కూడా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో వాటిపై కూడా ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి.
Next Story

