Thu Jun 12 2025 16:14:46 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్ కన్వెన్షన్ పై రంగనాధ్ ఏమన్నారంటే?
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ స్పందించారు.ము చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన ను కూల్చివేశామని తెలిపారు

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ స్పందించారు. తాము చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన ను కూల్చివేశామని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ పై గతంలో ఎలాంటి స్టేను న్యాయస్థానం ఇవ్వలేదన్నారు. హైకోర్టులో స్టే ఉన్నట్లు చెబుతున్నది అవాస్తమని రంగనాధ్ కొట్టిపారేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నందునే వాటి కూల్చివేశామని రంగనాధ్ తెలిపారు.
పూర్తిగా కబ్జా చేసి...
ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా కబ్జా చేసిన చెరువు ప్రాంతంలో నిర్మించారని రంగనాధ్ తెలిపారు. చట్టప్రకారమే తాను వ్యవహరించామని, అది నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణమని తేలిన తర్వాతనే కూల్చివేశామని ఆయన చెప్పారు. ఎన్ కన్వెన్షన్ ను క్రమబద్దీకరించుకునేందుకు దాని యజమానులు ప్రయత్నించారని, అయితే అధికారులు తిరస్కరించారని తెలిపారు.ఎన్ కన్వెన్షన్ పై హైకోర్టు, లోకాయుక్త తీర్పులు ఇప్పటికే ఉన్నాయన్న రంగనాధ్ ఎన్ కన్వెన్షన్ లోపల కట్టడాలన్నీ కూల్చివేశామని, ఇప్పుడు అది అక్కడ లేదని ఆయన అన్నారు.
Next Story