Mon Mar 16 2026 00:16:09 GMT+0530 (India Standard Time)
Hydra : ఈరోజు ఎనిమిది ఎకరాలను స్వాధీనం చేసుకున్న హైడ్రా
హైదరాబాద్ పరిధిలో ఆదివారం ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాధ్ ప్రకటించారు

హైదరాబాద్ పరిధిలో ఆదివారం ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాధ్ ప్రకటించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఈరోజు మూడు ప్రాంతాల్లో కూల్చివేతలను చేపట్టినట్లు తెలిపారు. కేవలం వ్యాపారాల కోసం నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చివేసినట్లు రంగనాధ్ తెలిపారు.
వ్యాపార సముదాయాలనే...
కూకట్పల్లి నల్ల చెరువులో ఉన్న అనధికార షెడ్లను కూల్చామని చెప్పారు. ఇక్కడ నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కూడా ఆక్రమణలను కూల్చివేశామని చెప్పుకొచ్చారు. ఒక ఎకరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పటేల్ గూడలో 25 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అధీనంలోకి తీసుకున్నామని తెలిపారు.
Next Story

