Wed Apr 08 2026 11:54:11 GMT+0530 (India Standard Time)
గచ్చిబౌలిలో హైడ్రా భారీ ఆపరేషన్
గచ్చిబౌలిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది

గచ్చిబౌలిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. పన్నెండు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలి IT కారిడార్‌లో హైడ్రా అధికారులు మంగళవారం భారీ ఆపరేషన్ చేపట్టి, రూ.1200 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.
శేరిలింగంపల్లిలో...
శేరిలింగంపల్లి ఖానామెట్‌లోని సర్వే నంబరు 55లో 8 ఎకరాలకుపైగా ఉన్న ఈ స్థలాన్ని బడా నిర్మాణ సంస్థల ఆక్రమణల నుంచి కాపాడారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు.ఆక్రమణలను తొలగించి అక్కడ బోర్డులను ఏర్పాటు చేశారు.
Next Story

