Wed Jan 14 2026 07:55:37 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ వాసులకు అలెర్ట్... గ్రౌండ్ వాటర్ మరింత కిందకు
హైదరాబాద్ వాసులకు అలెర్ట్. భూ గర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి.

హైదరాబాద్ వాసులకు అలెర్ట్. భూ గర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి. ఇటీవల కాలంలో భూగర్భ జలాల నీటి మట్టం పడిపోయింని అధికారులు తెలిపారు. గతంలో కురిసిన వానల వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగాయి. సాధారణం కంటే 35 శాతం ఎక్కువగా పెరిగాయి. కానీ గత మూడు నెలల నుంచి వర్షాలు లేవు. శీతాకాలం. నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలాలు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. నీటి వినియోగం పెరగడం, వానలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.
నిర్మాణ రంగం ఊపందుకోవడంతో...
మరొకవైపు నగరంలో నిర్మాణమవుతున్న భవనాల కారణంగా కూడా భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయని అంటున్నారుర. గత ఏడాది చివరిలో 5.93 మీటర్ల లోతులో ఉన్నభూగర్భ జలాలుప్రసతుతం 6.92 లోతుకు చేరాయి. రానున్నకాలంలో మరింతగా భూగర్భ జలాలు పడిపోయే అవకాశముందని చెబుతున్నారు. అలాగే ఎక్కువగా బోర్లు వేయడం వల్ల కూడా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పడిపోతుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలతో పాటు అందరూ అప్రమత్తమవ్వాల్సిన సమయమిది.
వర్షపాతం లేక...
కూకట్ పల్లి ప్రాంతంలో కేవలం ముప్ఫయి రోజుల్లోనే 5.38 మీటర్లు భూగర్భ జలాలు తగ్గాయి. అలాగే ఎస్సార్ నగర్ పరిధిలో మరింత లోతుకు వెళ్లాయి. ఇక కుత్బుల్లాపూర్ లో 2.73 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. అమీరర్ పేట్ లో 2.24 మీటర్లు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో సాధారణ వర్షపాతం 746 మిల్లీ మీటర్లు ఉండగా, గత ఏడాది 1008 మిల్లీ మీటర్లుగా నమోదయింది. భూగర్భ జలాలు మరింత లోతుకు వెళతాయని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
Next Story

