Wed Dec 31 2025 06:12:42 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : న్యూఇయర్ వేడుకలకు హైదరాబద్ లో ఇలా వెళితే ఇర్కుకున్నట్లే
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమయింది.

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమయింది. శాంతిభద్రతల కోసం పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాట్లు చేశార. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. గుంపులుగా రోడ్లపై తిరగొద్దని పోలీసుల ప్రజలకు సూచిస్తున్నారు. నిబంధనలను అతిక్రమిస్తు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
పబ్లు, ఈవెంట్ ప్రాంతాలపై సీసీ కెమెరాల నిఘా ఉంటుందని హెచ్చరించారు. మహిళల భద్రతకు ప్రత్యేక షీ టీమ్స్, పెట్రోలింగ్ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈవెంట్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో వెహికల్స్ కు నో ఎంట్రీ ఉంటుందని, ఫ్లైఓవర్లు మూసివేస్తున్నామని, భారీ వాహనాలపై రాత్రి నిషేధం ఉంటుందని చెప్పారు.
Next Story

