Sun Dec 14 2025 00:20:55 GMT+0000 (Coordinated Universal Time)
నాంపల్లి కోర్టుకు ఐబొమ్మ నిర్వాహకుడు
ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు

ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఈరోజు ఉదయం సీసీఎస్ పోలీసులు కూకట్ పల్లిలో అరెస్ట్ చేశారు. అతనిని విచారించిన అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి సీసీఎస్ పోలీసులు ఇమ్మడి రవిని విచారించారు. అతని బ్యాంకు ఖాతాలో ఉన్న మూడు కోట్ల రూపాయల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఐ బొమ్మ పేరుతో వెబ్ సైట్ ను కరేబియన్ దీవుల్లో నిర్వహిస్తూ కొత్తగా విడుదలయిన సినిమాను విడుదల చేస్తున్నాడు.
పోలీసులకే సవాల్ విసిరి...
దీంతో థియేటర్లకు ప్రేక్షకులకు రావడం మానేసి ఐబొమ్మలో కొత్త సినిమాను చూసేస్తున్నారు. విడుదలయిన కొద్ది నిమిషాల్లోనే ఐబొమ్మలో ప్రత్యక్షం కావడంతో తాము భారీగా నష్టపోతున్నామని నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఐ బొమ్మ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా గతంలో వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ వార్నింగ్ లను పట్టించుకోకుండా దమ్ముంటే తమను పట్టుకోవాలని వారు పోలీసులకు సవాల్ విసిరారు. అయితే ఈరోజు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ప్రవేశపెట్టారు.
Next Story

