Thu Mar 19 2026 08:59:29 GMT+0530 (India Standard Time)
ట్రాఫిక్ పోలీసులు ఆపారని.. బైకును తగలబెట్టి
హైదరాబాద్ పోలీసులు ఈరోజు నుంచి ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అయితే ఇది ఒక వ్యక్తి ఆగ్రహానికి కారణమయింది

హైదరాబాద్ పోలీసులు ఈరోజు నుంచి ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అయితే ఇది ఒక వ్యక్తి ఆగ్రహానికి కారణమయింది. మైత్రివనం సెంటర్ లో ట్రాఫిక్ పోలీసులు ఆపి చలానా రాశారని ఒక వ్యక్తి తన బైక్ ను తానే నిప్పంటించి తగలబెట్టేశాడు.
రాంగ్‌రూట్ లో...
ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్ రాంగ్‌రూట్ లో వస్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ వాహనంపై చలానా విధించారు. తనను ఎందుకు ఆపారంటూ ట్రాఫిక్ పోలీసులతో అశోక్ గొడవకు దిగాడు. పోలీసులు చలానా విధించడడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్ తన బైక్ ను తానే తగలబెట్టుకున్నాడు. బైక్ మొత్తం పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
Next Story

