Thu Jan 29 2026 02:41:07 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : వాహన యజమానులకు సజ్జనార్ వార్నింగ్
వాహనం నడుపుతూనే మొబైల్ ఫోన్ లేదా ఇయర్ఫోన్ వాడుతున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు

వాహనం నడుపుతూనే మొబైల్ ఫోన్ లేదా ఇయర్ఫోన్ వాడుతున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ చర్యలు ప్రమాదకరమని, చట్టరీత్యా శిక్షార్హమని కమిషనర్ వీ.సీ.సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు మొబైల్, ఇయర్ఫోన్ వాడకం ప్రమాదకరమని ఎక్స్ లో పోస్టు చేశారు ఆటో, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు వాహనం నడుపుతూనే వీడియోలు చూస్తున్నట్లు, ఇయర్ఫోన్లు వాడుతున్నట్లు గమనిస్తున్నామని, ఇది ప్రమాదకరమని, చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తున్నామని, ఇలాంటి డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని సజ్జనార్ హెచ్చరించారు.
వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడుతూ...
రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తమ భద్రతతోపాటు ప్రయాణికుల, ఇతర రహదారి వినియోగదారుల ప్రాణభద్రత కూడా అంతే ముఖ్యమన్నారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను బలి తీసుకుంటుందని, కాబట్టి డ్రైవింగ్ పైనే దృష్టి కేంద్రీకరించాలని, క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘనలు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరారు.
Next Story

