Fri Dec 05 2025 22:50:44 GMT+0000 (Coordinated Universal Time)
Alert : హైదరాబాద్ లో 33 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
మూడురోజుల్లో మొత్తం 33 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే..

హైదరాబాద్ ప్రయాణికులకు గమనిక. నగరంలో మూడు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మూడురోజుల్లో మొత్తం 33 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే వీటిని నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాక తిరిగి రైళ్లను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు.
లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్, రామచంద్రాపురం-ఫలక్నుమా, ఫలక్నుమా-రామచంద్రాపురం, ఫలక్నుమా-హైదరాబాద్ రైలు సర్వీసులను నేటి నుంచి ఫిబ్రవరి 22 బుధవారం వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. తిరిగి ఫిబ్రవరి 23, గురువారం నుంచి ఎంఎంటీఎస్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
Next Story

