Mon Mar 16 2026 00:11:49 GMT+0530 (India Standard Time)
మేయర్ గారు మరోసారి నోరు జారారు
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా వివాదంగా మారుతున్నాయి.

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా వివాదంగా మారుతున్నాయి. మహిళ దినోత్సవ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కుక్కలు ఎవరిపైనో దాడి చేస్తే తనను విమర్శించడమేంటని ఆమె అన్నారు. తానేమైనా కరవమన్నానా? అంటూ మేయర్ విజయలక్ష్మి ప్రశ్నించారు. ఎవరినో కుక్క కరిస్తే తానే కరవమన్నట్లు ప్రచారం చేశారంటూ ఆమె అన్నారు.
కుక్కలు ఎవరినో చంపితే...
మహిళలు రాజకీయాల్లోకి వస్తే అందరికీ చులకనేనని అన్నారు. తాను మేయర్ గా ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తున్నానని, కొందరు పనిగట్టుకుని తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండి పడ్డారు. రాజకీయాల్లో ఉన్న మహిళల గురించి చెడుగా మాట్లాడటం కొందరికి అలవాటుగా మారిందని గద్వాల్ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. రాజకీయంగా మహిళలు బయటకు వస్తే ఓర్వలేకపోతున్నారని ఆయన అన్నారు.
Next Story

