Sat Mar 07 2026 09:04:01 GMT+0530 (India Standard Time)
Congress : కాంగ్రెస్ కండువా కప్పుకున్న మేయర్
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయలక్ష్మిని సాదరంగా పార్టీలోకి కాంగ్రెస్ అగ్రనేతలు ఆహ్వానించారు.
బీఆర్ఎస్ లో గెలిచి...
గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ లో కార్పొరేటర్ గా గెలిచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ అయ్యారు. నాడు ఈ పదవికి పోటీ ఉన్నప్పటికీ కేసీఆర్ గద్వాల విజయలక్ష్మిని మేయర్ గా ఎంపిక చేశారు. పార్టీ అధికారం కోల్పోవడంతో ఆమె కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.
Next Story

