Sun Apr 27 2025 10:51:27 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో తాగునీటి సమస్య.. ఎండిన బోర్లు.. జలమండలి జరిమానా కొరడా
హైదరాబాద్ లో తాగు నీటి సమస్య పొంచి ఉంది. ఏప్రిల్ నెల నాటికే భూగర్భజలాలు ఇంకిపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి

హైదరాబాద్ లో తాగు నీటి సమస్య పొంచి ఉంది. ఏప్రిల్ నెల నాటికే భూగర్భజలాలు ఇంకిపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. ఇక తాగేందుకు నీరు కూడా తగినంత లభించడం లేదు. దీంతో జలమండలి అధికారులు నగర వాసులను అప్రమత్తం చేశారు. ఒకరకంగా నీళ్లు దుర్వినియోగం చేస్తే జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నల్లాకు మోటర్ బిగిస్తే ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తామని జలమండలి అధికారులు తెలపిరు. తక్షణమే మోటార్ ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నీటి సరఫరా సమయంలోనూ జలమండలి సిబ్బంది తనిఖీలు చేయనున్నారు.లైన్ మెన్ నుంచి ఎండీ స్థాయి వరకూ అందరూ రంగంలోకి దిగి తాగు నీటి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి సిద్ధమయ్యారు.
పదిహేనో తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్...
ఈ నెల పదిహేనో తేదీ నుంచి జలమండలి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. టార్గెట్ ‘మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ కార్యాచరణ చేపట్టారు. నల్లా నీటి సరఫరాలో ‘లో–పెషర్’కు చెక్ పెట్టేందుకు జలమండలి అధికారులు సిద్ధమయ్యారు. నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని జలమండలి అధికారులుు కోరారు. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని అన్నారు. రానున్నరోజులలో నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడని విజ్ఞప్తి చేసారు. అలాగే నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడితే మిగితా వినియోగదారులకు లో ప్రెషర్ తో నీటి సరఫరా కావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అనేకచోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు.
భూగర్భ జలాలు ఎండిపోవడంతో...
నీటి సరఫరా సమయంలో నల్లాలకు మోటర్లు బిగిస్తున్నట్లు జల మండలి ఇప్పటికే గుర్తించింది. నీటి పెష్రర్ కోసం కోసం వినియోగించే సాధారణ మోటర్లతోపాటు తాజాగా మార్కెట్లో వచ్చిన ఆటోమెటిక్ మెటర్ల కూడా వినియోగిస్తుండటంతో హైస్పీడ్ ప్రెషర్ పెరిగి దిగువ, చివరి కనెక్షన్‌దారులకు నీటిసరఫరా అంతంతమాత్రంగా తయారైనట్లు బయటపడింది. నల్లాలకు బిగించే సాధారణ మోటర్లు ఆన్ చేస్తే పనిచేస్తుండగా, ఆటోమెటిక్ మోటర్లు నల్లా సరఫరా ప్రారంభంకాగానే ఆటోమెటిక్‌గా పనిచేయడం ప్రారంభిస్తుండటంతో మిగితా కనెక్షన్లకు పెష్రర్ కూడిన నీటి సరఫరా సమస్యగా తయారైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో సాగర్ జలాలు తగ్గిపోయాయి. మంజీరా వాటర్ కూడా తగ్గింది. దీంతో పాటు జనాభా గణనీయంగా పెరగడంతో తాగునీటిని వృధా చేస్తే చర్యలు తప్పవని జలమండలి అధికారులు హెచ్చరించారు.
Next Story