Sat Mar 21 2026 14:39:41 GMT+0530 (India Standard Time)
Hyderabad : ఈ సమోసాలు తిన్నారో.. ఇక మీ కడుపు మటాష్
దాడిలో సమోసాలు పెద్ద ఎత్తున అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై చర్యలు కొనసాగుతున్నాయి. టాస్క్‌ఫోర్స్‌కి చెందిన హెచ్-ఫాస్ట్ బృందం, కుల్సుంపురా పోలీసులతో కలిసి జియాగూడలో నడుస్తున్న అక్రమ ఆహార తయారీ యూనిట్‌పై దాడి చేసింది. దాడిలో సమోసాలు పెద్ద ఎత్తున అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత యూనిట్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, అగ్నిమాపక అనుమతులు ఏవీ లేవని పోలీసులు తెలిపారు.
నాసిరకం పదార్థాలతో...
అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి ఈ యూనిట్ నడుపుతున్నట్లు గుర్తించారు. పాడైన, నాసిరకం పదార్థాలతో సమోసాలు తయారు చేస్తున్నాడు. ముదురు గుడ్లు, మళ్లీ మళ్లీ వాడిన నూనె ఉపయోగించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుందని పోలీసులు చెప్పారు.దాడిలో 500 పాడైన ఉడకబెట్టిన గుడ్లు, ఐదు కిలోల మళ్లీ వాడిన నూనె, 350 ఎగ్ సమోసాలు, 600 స్వీట్‌కార్న్ సమోసాలు, 1000 ఉల్లిపాయ సమోసాలు, అలాగే తయారీకి ఉపయోగించిన ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, కుల్సుంపురా పోలీస్ స్టేషన్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Next Story

