Thu Apr 02 2026 12:13:22 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ లో ఇళ్లకు తగ్గిన డిమాండ్.. రీజన్ ఇదే
భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో కుదుపుకు లోనయింది

భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో కుదుపుకు లోనయింది. అనేక పరిణామాలతో హైదరాబాద్‌లోనూ ఇళ్లకు భారీగా డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఉద్యోగాల్లో నెలకొన్న అభద్రత కూడా ఈ పరిస్థితి కారణమని చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టుల సరఫరా తగ్గడంతో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. జనవరి- మార్చి త్రైమాసికానికి సంబంధించి తాజాగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌ఈక్విటీ రిపోర్ట్ విడుదల చేసింది. తొమ్మిది ప్రధాన నగరాల్లో అమ్మకాలు లక్షలోపే ఉండటం గమనార్హం. హైదరాబాద్ నగరంలో ఇళ్ల అమ్మకాలు పదహారు శాతం మేర తగ్గి 11,546 ఇళ్లకు పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తుననాయి.
యల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌ఈక్విటీ రిపోర్ట్ మేరకు...
కరోనా సమయంలో ఇళ్ల కొనుగోళ్లు గణనీయంగా తగ్గింది. ఆ తర్వాత రెండేళ్లకు దేశంలో గణనీయంగా పుంజుకున్న రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ నెమ్మదించింది. ఇటీవల కాలంలో ఇళ్ల విక్రయాలు మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు 2026 జనవరి- మార్చి త్రైమాసికంలో సేల్స్ మరింత పడిపోయాయి. తాజాగా ఇళ్ల విక్రయాలకు సంబంధించి.. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ హౌసింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో చూస్తే వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి నుంచి మార్చిలో 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయాయి. గత 18 త్రైమాసికాల్లో ఒక త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు లక్ష లోపునకు పడిపోవడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఇది దేశీయంగా ప్రస్తుత హౌసింగ్ మార్కెట్ ఎలా ఉందనే పరిస్థితికి అద్దం పడుతోంది.
ఈ ఏడాది అతి తక్కువగా...
ప్రధానంగా కొత్త ప్రాజెక్టుల సరఫరా తగ్గడమే ఇళ్ల విక్రయాలు తగ్గేందుకు కారణమైందని రిపోర్ట్ వెల్లడించింది. పాత ఇళ్లు కూడా.. అలానే కొనుగోలు చేయకుండా మిగిలిపోతున్నాయి. ఏడాది కిందట ఇదే సమయంలో ఇళ్ల విక్రయాలు దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 1,13,602 యూనిట్లుగా ఉండేది. ఇక గతేడాది అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో కూడా సేల్స్ 1,05,527 యూనిట్లుగా ఉండగా.. ఇక్కడితో చూస్తే విక్రయాలు 6 శాతం మేర పడిపోయాయి. ఢిల్లీ- ఎన్.సి.ఆర్, ముంబై, నవీ- ముంబై, ఠాణే, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఈ పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలోనూ పదహారు శాతం మేర ఇళ్ల విక్రయాలు తగ్గి 11,546 యూనిట్లుగా నమోదైంది.
Next Story

