Sat Mar 28 2026 13:10:48 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ లో గంట సేపు నేడు లైట్లు ఆఫ్
హైదరాబాద్ వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నేడు అలర్ట్ చేసింది

హైదరాబాద్ వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నేడు అలర్ట్ చేసింది. ఈరోజు రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు మన పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించే 'ఎర్త్ అవర్' లో భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విజ్ఞప్తి చేశారు.
రాత్రి 8.30 గంట నుంచి...
భూతాపాన్ని తగ్గించి, సుస్థిర భవిష్యత్తును నిర్మించే లక్ష్యంతో చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా ఆ గంట సేపు అనవసరమైన విద్యుత్ దీపాలను ఆపివేసి భూమికి విశ్రాంతినివ్వాలని కోరారు. ఈ ఎర్త్ అవర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని కోరింది.
Next Story

