Sun Mar 08 2026 06:02:07 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో జవాన్ ఆత్మహత్య
చత్తీస్ గఢ్ కు చెందిన దేవేందర్ కుమార్ 2021లో సీఆర్పీఎఫ్ జవాన్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను సికింద్రాబాద్ లోని..

సీఆర్పీఎఫ్ కు చెందిన జవాన్ హైదరాబాద్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని అతని మృతి చెందారు. చత్తీస్ గఢ్ కు చెందిన దేవేందర్ కుమార్ 2021లో సీఆర్పీఎఫ్ జవాన్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను సికింద్రాబాద్ లోని సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా ఇంట్లో భద్రతా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం (ఏప్రిల్ 27) తెల్లవారుజామున చికోటి గార్డెన్ సమీపంలో దేవేందర్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం చెందాడు.
జవాన్ దేవేందర్ మరణం స్థానికంగా కలకలం రేపింది. అతను తన జీవితాన్ని అర్థంతరంగా ముగించుకోవడానికి కారణం ప్రేమ వ్యవహారమేనని బేగంపేట పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. జవాన్ దేవేందర్ మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలిపి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. జవాన్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

