Fri Dec 05 2025 17:44:51 GMT+0000 (Coordinated Universal Time)
Madhavi Latha : పోలీసుల కేసులకు నేను భయపేడేది లేదు
హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాధవీ లత సంచలన కామెంట్స్ చేశారు.

హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాధవీ లత సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో తమకు అనుకూలమైన ఒకటిన్నర లక్ష ఓట్లను తీసివేశామన్నారు. తమ పార్టీకి ఓటు వేసేవారిని అడ్డుకున్నారని, పోలీసులకు చెప్పించినా పట్టించుకోలేదన్నారు. హిజాబ్ ధరించిన మహిళల నుంచి మర్యాదగా ఓటరు ఐడీ కార్డు అడిగి పరిశీలించామని తెలిపారు.
న్యాయపోరాటం చేస్తాం...
బోగస్ ఓట్లు తొలగిస్తామని చెప్పిన అధికారులు వాటిని తొలగించలేదని మాధవీలత మండిపడ్డారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని మాధవీలత ఆరోపించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మాధవీ లత తెలిపారు. అక్కడ ఉన్న అధికారులను ప్రశ్నించినందుకు తనపై కేసులు నమోదు చేశారన్నారు. ఎటువంటి కేసులకు తాను భయపడే ప్రసక్తి లేదని మాధవిలత తెలిపారు.
Next Story

