Sun Dec 14 2025 00:26:13 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచ టాప్ 100 నగరాల్లో హైదరాబాద్
ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన టాప్-100 నగరాల్లో హైదరాబాద్ స్థానం సంపాదించింది.

ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన టాప్-100 నగరాల్లో హైదరాబాద్ స్థానం సంపాదించింది. భారతదేశం నుంచి మూడు నగరాలకు ఈ ఘనత దక్కింది. బెంగళూరు 29, ఢిల్లీ 54వ స్థానంలో నిలవగా హైదరాబాద్ 82వ స్థానం సాధించింది. మౌలిక వసతులు, పర్యాటక ప్రాంతాలు, ఆర్థికాభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు నివాసానికి అనుకూలంగా ఉండే ఇతర వసతులను పరిగణనలోకి తీసుకుని ‘2026 వరల్డ్ బెస్ట్ సిటీస్’ నివేదిక రూపొందించింది రెసొనెన్స్ కన్సల్టెన్సీ సంస్థ. ఇక టాప్-5 నగరాల్లో లండన్, న్యూయార్క్, పారిస్, టోక్యో, మాడ్రిడ్ నిలిచాయి.
Next Story

