Sun Dec 14 2025 13:27:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గగన్‌పహాడ్ లో ప్రజలు భయభ్రాంతులతో బయటకు పరుగులు తీస్తున్నారు

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గగన్‌పహాడ్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులతో బయటకు పరుగులు తీస్తున్నారు. ఒక థర్మాకోల్ పరిశ్రమలో ఈ మంటలు చెలరేగి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీకి కూడా మంటలు వ్యాపించే అవకాశముందన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు.
దట్టమైన పొగ...
దట్టమైన పొగ కారణంగా మంటలను ఆర్పలేకపోతున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. మరోవైపు పొగ కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
Next Story

