Fri Mar 06 2026 15:55:58 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు
హైదరాబాద్ లోని గాంధీ నగర్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది

హైదరాబాద్ లోని గాంధీ నగర్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. నిలోఫర్ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యురాలు వేగంగా కారును నడుపుతూ స్కూటీపై వెళుతున్న ఒక వ్యక్తిని ఢీకొనిందని సీసీ టీవీ పుటేజీ ద్వారా కనుగొన్నారు. దీంతో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చేరి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని బంధువులు తెిపారు.
పోలీసులు కేసు నమోదు చేయకుండా...
అయితే పోలీసులు మాత్రం హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయలేదని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యురాలిపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయాలని, వైద్యరాలిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కావాలంటే సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించుకోవచ్చని చెబుతున్నారు. దీంతో పోలీసులు సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.
Next Story

