Mon Feb 02 2026 01:03:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సికింద్రాబాద్ బంద్
నేడు సికింద్రాబాద్ కు హిందూ సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో దుకాణాలన్నీ మూసివేశారు

నేడు సికింద్రాబాద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా ఈరోజు సికింద్రాబాద్ లో బంద్ పాటించాలని నిర్ణయించారు. వ్యాపార సంస్థలు మూసివేసి తమ బంద్ కు సహకరించాలని నిర్వాహకులు కోరారు. బంద్ ను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.
స్వచ్ఛందంగా బంద్...
సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్, ప్యారడైజ్ సహా షాపులన్నీ బంద్ చేశారు. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతం నేడు దుకాణాల బంద్ తో బోసిపోయి ఉంది. సికింద్రాబాద్ బంద్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

