Tue Jul 08 2025 18:23:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిగాచీ పరిశ్రమ వద్దకు హైలెవెల్ కమిటీ
సిగాచీ పరిశ్రమ ప్రమాద స్థలాన్ని నేడు హైలెవెల్ కమిటీ పరిశీలించనుంది.

సిగాచీ పరిశ్రమ ప్రమాద స్థలాన్ని నేడు హైలెవెల్ కమిటీ పరిశీలించనుంది. ప్రభుత్వం ఈ ప్రమాదంపై హైలెవెల్ కమిటీని నియమించింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సిగాచీ పరిశ్రమ వద్ద పర్యటించి ప్రమాదానికి గల కారణాలతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుని ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికను సమర్పించనుంది.
39 మందికి చేరిన మృతుల సంఖ్య...
ఇప్పటికే సిగాచీ పరిశ్రమ ప్రమాదంపై నిపుణుల కమిటీ కూడా ఏర్పాటయింది. అయితే ఈ కమిటీ నిన్న పరిశీలించి కొంత మేర సమాచారాన్ని సేకరించింది. నిపుణుల కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో ఇప్పటి వరకూ మృతి చెందిన కార్మికుల సంఖ్య 39కి చేరిందని అధికారులు తెలిపారు.
Next Story