Wed Jan 21 2026 11:03:26 GMT+0000 (Coordinated Universal Time)
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అందుకు కారణం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అందుకు కారణం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపులు రావడమే! తెల్లవారుజాము సమయంలో కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లుగా చెప్పాడు. దీంతో అధికారులు, పోలీసులు తెల్లవారుజామున నుండి చెకింగ్ ను ముమ్మరం చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపుతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. సోదాల అనంతరం చివరకు బాంబు లేదని నిర్ధారించారు. బాంబు లేదని నిర్ధారించుకున్న అధికారులు అదొక ఫేక్‌కాల్‌గా తేల్చారు. బెదిరింపు కాల్ చేసిన ఆగంతకుడిని కనిపెట్టే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు.
Next Story

