Sat Dec 13 2025 22:35:19 GMT+0000 (Coordinated Universal Time)
మా కుటుంబంలోనూ డిజిటల్ అరెస్ట్ : నాగార్జున
తమ కుటుంబంలోనూ ఒకరు డిజిటల్ అరెస్ట్ కు గురయ్యారని హీరో నాగార్జున తెలిపారు

తమ కుటుంబంలోనూ ఒకరు డిజిటల్ అరెస్ట్ కు గురయ్యారని హీరో నాగార్జున తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడం చిత్ర పరిశ్రమకు మంచి జరిగిందని తెిలపారు. పైరసీని అరికట్టడంలో హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషిని నాగార్జున ప్రశంసించారు.
డేటా మొత్తాన్ని వారి చేతుల్లోకి..
వెబ్ సైట్ ల కోసం తమ వివరాలను వారికి అందిస్తే డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారని అన్నారు. తమ కుటుంబంలోనూ ఒకరిని రెండు రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారని తెలిపారు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చే లోపు వారు తప్పించుకున్నారని నాగార్జున ఈ సందర్భంగా తెలిపారు. ఉచితంగా సినిమా వెబ్ సైట్లలో చూస్తున్నామని భావిస్తే అది సైబర్ నేరగాళ్లకు సహకరించినట్లే అవుతుందని ఆయన అన్నారు.
Next Story

