Thu Dec 18 2025 07:33:45 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. కారు మబ్బులతో కమ్మేసిన నగరం
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది.

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. గంట నుంచి కారుమబ్బులు కమ్ముకోవడంతో నగరం చీకటి మయంగా మారింది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు వదిలి పెట్టే సమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీజలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి కూడా నీరు చేరింది. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారి చల్లటి గాలులతో ప్రారంభమై తర్వాత భారీ వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రోడ్లన్నీ చెరువులుగా...
హైదరాబాద్ లో భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం తడిసి ముద్దయింది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపైకి నీళ్లు చేరాయి. రోడ్లన్నీ చెరువులుగా మారడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్ల ట్రాపిక్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు వాహనాలు కదలకుండా మొరాయించాయి.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షం...
హైదరాబాడ్ నగరంలో మేడ్చల్, మాదాపూర్, నిజాంపేట్, మూసాపేట, కేపీహెచ్బీ, లింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మల్లంపేట్, దుండిగల్, గండి మైసమ్మ, కృష్ణాపూర్, ఎల్బీనగర్, సరూర్ నగర్, అమీర్ పేట్, లక్డాకీపూల్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. భారీవర్షం కురియడంతో అనేకచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి ఉక్కపోతతో మొదలయిన వాతావరణం సాయంత్రానికి భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Next Story

