Fri Dec 05 2025 09:29:33 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో దంచి కొట్టిన వర్షం.. గంట పాటు కుండపోత
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై నీరు ప్రవహిస్తుంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరిక జారీ చేసింది. అయితే సాయంత్రం వేళ వర్షం పడటంతో విధుల ముగించుకుని ఇంటికి వస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో రహదారిపైకి నీరు చేరి ట్రాఫిక్ స్థంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు చేరి ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో అనేక చోట్ల వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్డుపై నిలిచిన నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
ఉదయం నుంచే మేఘాలు కమ్ముకుని..
ఉదయం నుంచి మేఘాలు కమ్ముకుని ఉండటంతో భారీ వర్షం పడుతుందని ముందుగానే ప్రజలు అంచనా వేశారు. ఉప్పల్, రామాంతపూర్, మలక్ పేట్, ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్ నగర్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్నీ జలమయమయ్యాయి. కొన్ని ఇళ్లలోకి నీరు చేరాయి. ఇక రహదారులపైకి నీరు చేరడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. అనేక మంది తమ వాహనాలు కదలకపోవడంతో మెకానిక్ ల వద్దకు తీసుకెళుతున్నారు. కొన్నిరహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో అక్కడి నుంచి నీరు బయటకు పంపించేందుకు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నాలా మూతలు ఓపెన్ చేసి వాటిని కిందకు వదులుతున్నారు.
కుండపోత వర్షం కురియడంతో...
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురియడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల కార్లు కూడా వర్షపు నీటికి కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతుంది. దాదాపు నలభై నిమిషాల నుంచి వర్షం కురుస్తుండటంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో విచిత్రమైన పరిస్థితులున్నాయి. కొన్నిచోట్ల కుండపోత వర్షం కురుస్తుండగా, మరికొన్ని చోట్ల మాత్రం చినుకు పడలేదు. అయితే వర్షం పడిన ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి బీభత్సంగా ఉంది. పోలీసు, రెవెన్యూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. దాదాపు గంట సేపు దంచికొట్టిన వానతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు.
Next Story

