Wed Jul 09 2025 19:24:48 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం.. ఉదయం నుంచి మొదలయిన కుండపోత వాన
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి భారీ వర్షం మొదలవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి భారీ వర్షం మొదలవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పిల్లలు వర్షం దెబ్బకు తడిసి ముద్దవుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి వర్షం పడుతుంది. భారీ వర్షం పడుతుండటంతో అనేక రహదారులపై నీరు ప్రవహిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా పాఠశాలలను తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఉదయం నుంచి వర్షం ప్రారంభం కావడంతో అనేక ప్రాంతాలు హైదరాబాద్ లో తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు...
ఉదయం నుంచి వర్షం ప్రారంభం కావడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, అమీర్ పేట్, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, రామాంతపూర్, మలక్ పేట్, ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్ నగర్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్నీ జలమయమయ్యాయి. ఉదయాన్నే కావడంతో ఇంకా వాహనాలు రోడ్డు పైకి చేరుకోకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకపోయినా ప్రజలు మాత్రం ఇబ్బందులుపడుతున్నారు.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం...
ఖైరతాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. ఇక రహదారులపైకి నీరు చేరడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురియడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగకుండా వర్షం కురవడంతో అనేక చోట్ల నగరంలో విద్యుత్తు సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినట్లుగానే ఈరోజు ఉదయం నుంచే వర్షం పడుతుండటంతో ముఖ్యంగా పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులు సయితం రోడ్లపైన విక్రయించేందుకు వచ్చి వర్షం పడటంతో అవస్థలు పడుతున్నారు.
Next Story