Sat Mar 07 2026 20:44:48 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ లో ఉదయం నుంచి భారీ వర్షం
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయం అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
ట్రాఫిక్ సమస్యలు...
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో విధులకు వెళ్లేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్లపైకి నీరు చేరడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

