Thu Mar 19 2026 10:29:41 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో కుండపోత వాన
హైదరాబాద్ లో రెండు గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయిన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది

హైదరాబాద్ లో రెండు గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయిన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. తిరుమలగిరి, సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, కూకట్పల్లిలో భారీ వర్షం నమోదయింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ట్రాఫిక్ ఇబ్బందులు...
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాలనుకున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
Next Story

