Thu Mar 19 2026 10:30:02 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. రహదారులపైకి నీళ్లు చేరాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. రోజూ లాగే సాయంత్రం మేఘాలన్నీ కమ్ముకుని ఒక్కసారి వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మెహదీపట్నం, నంజాగుట్ట, ఎస్సార్ నగర్, అమీర్ పేట్ కూకట్ పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.
రోడ్లపైకి వర్షపు నీరు...
భారీ వర్షంలో రహదారులపైకి నీళ్లు చేరాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు గంటలు ఆగి తమ ప్రయాణాలు కొనసాగించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
Next Story

