Fri Jan 30 2026 02:19:13 GMT+0000 (Coordinated Universal Time)
తేరుకోకముందే.. హైదరాబాద్ లో భారీ వర్షం
ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ వాసులు ఇంకా తేరుకోకముందే మరోసారి వర్షం కురుస్తోంది

ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ వాసులు ఇంకా తేరుకోకముందే మరోసారి వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురుస్తూ ఉంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన ప్రకారంగానే హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో భారీ వర్షం కురుస్తూ ఉంది. లింగంపల్లి, ఆశోక్ నగర్, మియాపూర్, బాలానగర్, నేరేడ్ మెట్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీ నగర్, ఖైరతాబాద్, తదితర ప్రాంతాలను కూడా వరుణుడు పలకరించాడు. వర్షాలపై జీహెచ్ఎంసీ ప్రజలను అప్రమత్తం చేసింది. రేపు ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసర సమయాల్లో 900113667, 040-2111 1111 నంబర్లలో సంప్రదించాలని కోరింది.
కుండపోత వానతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటూ.. రేపు 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, ములుగు, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
Next Story

