హైదరాబాద్ లో దారుణం: తల్లి మృతదేహంతో 9 రోజులు ఉన్న కూతుళ్లు
హైదరాబాద్ లో హృదయ విదారక ఘటన. తల్లి మృతదేహంతో 9 రోజులు గడిపిన ఇద్దరు కూతుళ్లు, ఆవేదనలో ఆత్మహత్య ప్రయత్నం.

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది... పేదరికం ఎంత భయంకరంగా ఉంటుందో ఇటువంటి సంఘటనలు చూస్తుంటే గుండె చలించి పోతుంది..!!అన్నీ తానై చూసుకుంటున్న తల్లి అనారోగ్యంతో తనువు చాలించింది...ఏం చేయాలో తోచక, ఎవరికి చెప్పుకోవాలి తెలియక, కనీసం తిండి కూడా తినకుండా తోమ్మిది రోజులు అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.ఒకనొక దశలో ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలుస్తోంది.,!!
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజుకు లలిత(45) తో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.
మనస్పర్థలు కారణంగా రాజు 2020 లో ఎటో వెళ్ళిపోయాడు..అప్పటి నుంచి లలిత అన్నీ తానై తన తల్లి సపోర్ట్ తో కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది..!!
ఆరునెలల కిందట ఓయూ ప్రాంతం నుంచి బౌద్ద నగర్ లోని అద్దె ఇంట్లోకి చేరారు.ఇటీవల తన తల్లి మరణించడంతో లలిత మానసికంగా కుంగి పోయింది.పైగా మూడు నెలలు గా అద్దె కూడా చెల్లించలేక పోయారు.సడెన్గా ఒకరోజు లలిత రాత్రి నిద్రలోనే కన్నుమూసింది.. తల్లి చనిపోవడంతో అంత్యక్రియలకు డబ్బులు లేక, తొమ్మిది రోజులుగా తిండి తిప్పలు లేకుండా
తల్లి మృతదేహాన్ని ఒక గదిలో ఉంచి వీరు ఇంకో గదిలో ఉన్నారు.ఇంటియజమాని అక్కడికి వెళ్ళినప్పుడు లలిత కనబడలేదు, వీళ్ళు అసలు విషయం చెప్పలేదు.
కూతుర్లు ఇద్దరూ శుక్రవారం బయటకు వచ్చి చుట్టు పక్కల వారికి అసలు విషయం చెప్పగా, వారు పోలీసులకు సమాచారం అందించారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.అంబర్ పేటలో ఉన్న లలిత సోదరుడితో మాట్లాడి
అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఒప్పించామని, కూతుర్లు చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు..!!