Tue Jan 20 2026 15:08:53 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన హరీష్ రావు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు విచారణ ముగిసింది

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు విచారణ ముగిసింది. ఉదయం పదకొండు గంటలకు సిట్ అధికారుల ఎదుటకు హాజరయిన హరీష్ రావును దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. అయితే హరీష్ రావు విచారణ ఎంతకూ ముగియకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తలరలి వచ్చాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద...
ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. మహిళ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని డీసీఎం వ్యాన్ లో అక్కడి నుంచి తరలించారు. సాక్షిగా పిలిచిన హరీష్ రావును ఇంతసేపు విచారణ చేయడమేంటని ప్రశ్నించారు. దీంతో పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.
Next Story

