Fri May 03 2024 10:21:57 GMT+0000 (Coordinated Universal Time)
ఆ తేదీల్లో.. హైదరాబాద్ స్కూల్స్ కు హాలిడేస్
గ్రూప్-2 రిక్రూట్మెంట్ పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలకు
గ్రూప్-2 రిక్రూట్మెంట్ పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలకు ఆగస్టు 29, 30 తేదీలను సెలవులుగా పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించింది. అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 783 గ్రూప్-II పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందుకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రిక్రూట్మెంట్ పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా, వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. జనరల్ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. మొత్తంగా ఈ నోటిఫికేషన్లో మహిళలకు 44 శాతానికి పైగా పోస్టులు దక్కాయి.
Next Story