Sun Mar 15 2026 13:41:34 GMT+0530 (India Standard Time)
బీజేపీ, టీఆర్ఎస్లకు భారీ జరిమానా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ, టీఆర్ఎస్ కు భారీ జరిమానా విధించింది

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ, టీఆర్ఎస్ కు భారీ జరిమానా విధించింది. బీజేపీకి 20 లక్షలు.. టీఆర్ఎస్ కు 3 లక్షల జరిమానాను జీహెచ్ఎంసీ విధించింది. నిబంధనలకు విరుద్ధంగా నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ జరిమానాను జీహెచ్ఎంసీ విధించింది.
నిబంధనలకు విరుద్ధంగా....
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తుండటంతో టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. రెండు పార్టీలు నగరంలో అనేక రోడ్లలో ఫ్లెక్సీలను నిబంధనలకు విరుద్థంగా ఏర్పాటు చేశాయి. దీంతో జీహెచ్ఎంసీ రెండు పార్టీలకు భారీ జరిమానా విధించింది.
Next Story

