Sun Mar 15 2026 13:40:52 GMT+0530 (India Standard Time)
బాలుడి కుటుంబానికి పరిహారం
అంబర్పేట్ లో వీధి కుక్కలదాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిహరం ప్రకటించింది

హైదరాబాద్‌లోని అంబర్పేట్ లో వీధి కుక్కలదాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిహరం ప్రకటించింది. మృతి చెందిన బాలుడి కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల వీధి కుక్కలదాడిలో అంబర్ పేట్ లో ప్రదీప్ అనే బాలుడు మరణించిన సంగతి తెలిసిందే.
కుక్కలదాడిలో మరణించిన...
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రభుత్వంపైన, జీహెచ్ఎంసీపైనా అనేక విమర్శలు వచ్చాయి. బాలుడి కుటుంబానికి నెల రోజుల వేతనం ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఒకనెల జీతం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సమావేశంలో నిర్ణయించారు.
Next Story

