Fri Dec 05 2025 23:50:45 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మిస్‌వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్స్
రేపు మిస్‌వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్స్ జరగనున్నాయి. హైదరాబాద్ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు

రేపు మిస్‌వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ పోటీ జరగనుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ లో జరగుతున్న మిస్ వరల్డ్ పోటీలు రేపటితో ముగియనున్నాయి. మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్స్ కు హైదరాబాద్ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. పాస్ లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. ఈ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా మొత్తం నూట యాభై దేశాల్లో పోటీల లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు.
పటిష్టమైన భద్రత మధ్య...
మిస్ వరల్డ్ విజేతకు 8.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గత కొద్ది రోజులుగా ప్రపంచదేశాలకు చెందిన సుందరీమణులు వచ్చితెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించడంతో రాష్ట్ర టూరిజానికి కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హారు కానున్నారు. గ్రాండ్ ఫినాలే సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

