Wed Mar 18 2026 20:58:48 GMT+0530 (India Standard Time)
Telangana : ఆ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానివే
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదును చేస్తున్న భూములు ప్రభుత్వానివేనని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదును చేస్తున్న భూములు ప్రభుత్వానివేనని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. న్యాయస్థానాల్లో కూడా అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపింది. ఆ ప్రాజెక్ట్ లో సెంట్రల్ యూనివర్సిటీ భూములు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అభివృద్ధి జరగాలంటే కొన్ని భూములను చదును చేయడంలో తప్పులేదని తెలిపింది.
ఎవరు అడ్డుకున్నా...
అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని ఎవరు అడ్డుకున్నా అది కోర్టు థిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది. ఈ నాలుగు వందల ఎకరాల భూమి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానిదేనని, యాజమాన్య హక్కులు కూడా ప్రభుత్వానికే ఉన్నాయని, ఇందులో మరొక సందేహం లేదని తెలిపింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు కూడా లేదని స్పష్టం చేసింది.
Next Story

