Wed Jan 21 2026 17:06:11 GMT+0000 (Coordinated Universal Time)
Raja Singh : వారికి రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
వినాయక విగ్రహాల ఏర్పాటుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు

వినాయక విగ్రహాల ఏర్పాటుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇష్టం వచ్చిన రూపాల్లో గణేష్ విగ్రహాలను పెట్టొద్దని కోరారు.ఇది మన మతానికే అవమానం అని చెప్పారు. ఎవరైనా ఇలాంటి విగ్రహాలను తయారు చేసినా, మండపాల్లో పెట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజాసింగ్ హెచ్చరించారు.
వినాయక విగ్రహాలను...
వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి పూజలు నిర్వహించడం, అనంతరం నిమజ్జనం చేయడం వంటివి సెంటిమెంట్ తో కూడినవి కావడంతో వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అంతే తప్ప ఎవరి అటెన్షన్ కోసమో, ప్రచారం కోసమో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం సమంజసం కాదని తెలిపారు.
Next Story

