Mon Dec 08 2025 02:07:07 GMT+0000 (Coordinated Universal Time)
Good News : హైదరాబాద్ లో ఐటీ నిపుణులకు శుభవార్త
హైదరాబాద్ లో ఐటీ నిపుణులకు శుభవార్త. తెలంగాణలో మరో భారీ ఐటీ క్యాంపస్ రానుంది.

హైదరాబాద్ లో ఐటీ నిపుణులకు శుభవార్త. తెలంగాణలో మరో భారీ ఐటీ క్యాంపస్ రానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. హెచ్.సి.ఎల్ టెక్ గ్లోబల్ సీఈవో విజయ్ కుమార్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
హైటెక్ సిటీలో...
హైటెక్ సిటీలో క్యాంపస్ ను నిర్మించడానికి హెచ్.సి.ఎల్ అంగీకరించింది. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ ను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్యాంపస్ కారణంగా ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే నెలలో దీనిని ప్రారంభించేందుకు సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రిని హెచ్.సి.ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కోరగా అందుకు రేవంత్ అంగీకరించారు. ఈరోజు ఆఖరి రోజు కావడంతో వరస ఒప్పందాలతో రేవంత్ బిజీగా గడుపుతున్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.
Next Story

