Mon Jan 12 2026 07:03:17 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతికి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ టు విశాఖ ప్రయాణం ఐదు గంటల ఆదా
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. దీనివల్ల హైదరాబాద్ - విశాఖపట్నంల మధ్య ప్రయాణం ఐదు గంటలు తగ్గనుంది. ఐదు గంటల సమయం ఆదా కావడం అంటే మామూలు విషయం కాదు. బస్సు టిక్కెట్ల ధరలు కూడా తగ్గుతాయి. పెట్రోలు, డీజిల్ కూడా చాలా వరకూ ఆదా అవుతుంది. పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారి, ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు విస్తరించి ఉంది. కోర్టు వివాదాలు పరిష్కారమవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
ప్రయాణ దూరం...
ఈ జాతీయ రహదారి పూర్తయితే హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేవారికి ఈ హైవే చాలా అనుకూలంగా ఉంటుంది.. విజయవాడ కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా విశాఖకు చేరుకోవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాలు త్వరలో పరుగులు తీయనున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ హైవేపై వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వడానికి జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఈ హైవేను అందుబాటులోకి తీసుకురావాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారి, తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు నిర్మిస్తున్నారు.
గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు...
తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని లోని దేవరపల్లి వరకు నిర్మిస్తున్న యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని మొత్తం పొడవు 162.10 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టులో భాగంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 56.88 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. చింతలపూడి మండలం రేచర్ల దగ్గర ఈ రహదారి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించి, కన్నాయగూడెం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నేషనల్ హైవే 365 బీజీ కింద ఖమ్మం - దేవరపల్లి నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి 162 కి.మీ మేర సుమారు రూ.4,609 కోట్లతో నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య దూరం సుమారు 125 కిలోమీటర్లు తగ్గుతుంది.
125 కిలోమీటర్ల దూరం తగ్గి...
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే విజయవాడ మీదుగా 676 కిలోమీటర్లు పన్నెండు గంటల పాటు ప్రయాణించాలి. అదే ఈ హైవే అందుబాటులోకి వస్తే దాదాపు 125 కి.మీ.దూరం తగ్గుతుందని, దూరం మాత్రమే కాకుండా, ట్రాఫిక్ కూడా తగ్గడంతో దాదాపు 5 గంటల వరకు సమయం ఆదా అవుతుంది అంటున్నారు. ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల మధ్య కొంత భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉండటంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ వివాదం పరిష్కారం కావడంతో, రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల్ని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. సో.. సంక్రాంతికి హైదరాబాద నుంచి ఉత్తరాంధ్ర వెళ్లే వారందరీకి ఇది తీపికబురు అని అనుకోవాలి. ప్రమాదరహితమైన ప్రయాణం చేసేందుకు వీలవుతుంది.
Next Story

