Fri Apr 10 2026 03:27:13 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడిప్రియులకు నేడు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి

పసిడిప్రియులకు నేడు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. పెళ్ళిళ్ల సీజన్ దగ్గరపడుతున్న సమయంలో బంగారం ధర భారీ గా దిగి రావడం ఊరట కలిగించే అంశంగానే చూడాలి. ఇక కొనుగోళ్లు కూడా పుంజుకుంటాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ అమ్మకాలు లేక ఈగలు తోలుకుంటున్న దుకాణాలు కస్టమర్లతో ఇక కళకళలాడనున్నాయి.
భారీగా తగ్గి...
బంగారం ధర గురువారం భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,200 తగ్గి రూ.1,58,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 తగ్గి రూ. 1,45,200వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర మూడు లక్షల రూపాయలుగా ఉంది.
Next Story

