Fri Apr 03 2026 19:58:17 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ కు భారీ పెట్టుబడులు
గోద్రేజ్ కంపెనీ కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుంది. ఈ మేరకు ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటన చేసింది

హైదరాబాద్ లో బహుళ జాతి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్ వాతావరణంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కూడా పరిశ్రమలు ఎక్కువగా రావడానికి కారణంగా చెప్పాలి. ఇప్పటికే అనేక కొత్త కంపెనీలు హైదరాబాద్ కు వస్తుండగా, ఉన్న కంపెనీలు ఇక్కడే విస్తరణను చేపట్టాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీ కారణంగానే ఎక్కువ సంఖ్యలో కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయి.
గోద్రేజ్ కంపెనీ....
తాజాగా గోద్రేజ్ కంపెనీ కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుంది. ఈ మేరకు ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటన చేసింది. 12 నుంచి 18 నెలల్లో 7,500 కోట్ల పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఉన్నామని గోద్రేజ్ కంపెనీ చెప్పింది. ఈ కంపెనీ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Next Story

