Fri Dec 05 2025 06:22:14 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ప్లాస్టిక్ పై నడుద్దాం
జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్‌పాత్‌లపై ప్లాస్టిక్ టైల్స్ వినియోగించాలని నిర్ణయించారు.

జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్‌పాత్‌లపై ప్లాస్టిక్ టైల్స్ వినియోగించాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో ప్రతి రోజు పోగయ్యే సుమారు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్తలోని ప్లాస్టిక్ ను వేరు చేసి, దాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆవరణలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్ లో రీ సైక్లింగ్ చేసి, ఫుట్ పాత్ లకు వినియోగించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్ ను సెలెక్ట్ చేశారు. ప్లాస్టిక్ ను రీ సైక్లింగ్ చేసి దాంతో పలు నమునాలతో ప్లాస్టిక్ టైల్స్ తయారు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు ప్లాస్టిక్ కూడా పేరుకుపోకుండా ఉంటుందని భావిస్తున్నారు. రాజ్ భవన్ రోడ్డులో కిలోమీటర్ మేర ఫుట్ పాత్ పై ప్లాస్టిక్ టైల్స్ గానీ, ఫ్లోరింగ్ గానీ వేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.
Next Story

