Sat Mar 07 2026 21:02:19 GMT+0530 (India Standard Time)
Ys Jagan : జగన్ నివాసంలో ఆక్రమణలు కూల్చివేత
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసమైన లోటస్ పాండ్ లో ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసమైన లోటస్ పాండ్ లో ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ లోని జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఫిర్యాదులు చేయడంతో ఈ ఆక్రమణలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.
లోటస్ పాండ్ లో...
ఫుట్పాత్ ను ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ లను నిర్మించడమే కాకుండా, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారని జీహెచ్ఎంసీ సిబ్బందికి స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ ఆక్రమణలను తొలగిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు.
Next Story

