Sun Dec 14 2025 00:22:12 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : జీహెచ్ఎంసీ కౌన్సిల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకముందే కార్యాలయ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకముందే కార్యాలయ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పలు సమస్యలపై తమ నిరసనలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం నగర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
దున్నపోతుతో...
బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని హాల్లోకి వెళ్లారు. వాటిని తీసేయాలని మార్షల్స్ ప్రయత్నించడంతో స్వల్ప గందరగోళం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సమయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ జోక్యం చేసుకున్నారు. ఆయన మార్షల్స్‌ను హాల్ నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో ఉద్రిక్తత చల్లారింది.ఇక ఈఘటనకు ముందే బీజేపీ కార్పొరేటర్లు విభిన్నంగా నిరసన తెలిపారు. సమావేశానికి వెళ్లే ముందు దున్నపోతుకు వినతిపత్రం అందించి తమ వ్యతిరేకతను తెలియచేశారు. దున్నపోతుకు వినతిపత్రాన్ని సమర్పించారు.
Next Story

