Tue Mar 31 2026 11:46:38 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో మాజీ సీఎం ఇంటిని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత భవనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత భవనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. యూసఫ్ గూడలో ఉన్న ఈ ఇంటికి గత కొన్నేళ్లుగా ఆస్తి పన్నుచెల్లించకపోవడంతో ఇంటిని సీజ్ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. శ్రీనగర్ కాలనీలో జయలలితకు జీ+4 భవనం ఉంది.
ఆస్తి పన్ను బకాయీ...
ఆస్తి పన్ను బకాయీలను 2017 నుంచి చెల్లించడం లేదు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. దాదాపు 83 లక్షల రూపాయల ఆస్తి పన్ను బకాయీ ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీంతో నోటీసులకు ఎవరూ స్పందించకపోవడంతో జయలలిత ఇంటిని సీజ్ చేశారు.
Next Story

