Sat Dec 13 2025 22:32:14 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : అన్నపూర్ణ, రామానాయుడు స్డూడియోస్ లకు జీహెచ్ఎంసీ ఝలక్
అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు

అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు.లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించారని నోటీసులు జారీ చేశారు. ఉన్న చదరపు అడుగుల కంటే తక్కువగా చూపించి లైసెన్స్ ఫీజును గత కొద్ది రోజులుగా తక్కువగా చెల్లిస్తున్నారని గుర్తించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
లైసెన్స్ ఫీజు తక్కువగా...
ట్రేడ్ లైసెన్స్ లు తక్కువగా చెల్లించడంపై ఈ నోటీసులు జారీ చేశారు. తక్కువ మొత్తంలో లైసెన్స్ ఫీజు చెల్లించడంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నష్టం వాటిల్లుతుందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Next Story

